అర్జున్ సంయుక్తంగా అగ్రస్థానంలో.. కోనేరు హంపి, హారిక కూడా
భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి వరల్డ్ చెస్ ర్యాపిడ్, బ్రిట్జ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి వరల్డ్ చెస్ ర్యాపిడ్, బ్రిట్జ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. శనివారం నాలుగు రౌండ్లు జరగగా.. అర్జున్ ఒక్క ఓటమి కూడా పొందలేదు. రెండు విజయాలు, రెండు డ్రాలు నమోదు చేశాడు. 6వ రౌండ్‌లో రే రాబ్సన్(అమెరికా)పై, 8వ రౌండ్‌లో శాంట్ సర్గ్స్యాన్(అర్మేనియా)పై గెలుపొందాడు. 7వ రౌండ్‌లో ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ ముర్జిన్‌తో, 9వ రౌండ్‌లో పొలాండ్ గ్రాండ్‌మాస్టర్‌తో పాయింట్ పంచుకున్నాడు. 9 రౌండ్లు ముగిసే సరికి అర్జున్ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి చెరో 65 పాయింట్లతో ఉమ్మడిగా టాప్ పొజిషన్‌లో ఉన్నారు. రెండో రోజు కోనేరు హంపి బలంగా పుంజుకుంది. నాలుగు రౌండ్లలోనూ నెగ్గింది. హారిక రెండు విజయాలు, రెండు డ్రాలు చేసుకుంది.