Bumrah : బూమ్రా అరుదైన రికార్డు..వేగంగా 200వికెట్లు

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్ గా నిలిచాడు.

Update: 2024-12-29 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్ గా నిలిచాడు. మొత్తం మీద నాల్గవ బౌలర్ కావడం విశేషం. ఆస్ట్రేలియా ఇండియా మధ్య (AUS vs IND) జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో నాల్గవ టెస్టు అసీస్ రెండో ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడు ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ ఘనత సాధించాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200+ వికెట్ల మార్క్ ను అందుకొన్నాడు.

ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ (7,848), కగిసో రబాడ (8,153) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే, మ్యాచుల పరంగా స్పిన్నర్ అశ్విన్ (37 మ్యాచులు) భారత్ తరపున ముందున్నాడు. అసీస్ పర్యటనలో జోరుమీదున్న బూమ్రా మెల్ బోర్న్ లో జరుగుతున్న టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఇప్పటికే 8వికెట్లు తీశారు. అసీస్ రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 199/9పరుగులతో ఆట కొనసాగిస్తోంది.

Tags:    

Similar News