Robin Uthappa : రాబిన్ ఉతప్ప అరెస్ట్ వారెంట్‌పై ‘స్టే’.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అరెస్ట్ వారెంట్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం ‘స్టే’ విధించింది.
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అరెస్ట్ వారెంట్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం ‘స్టే’ విధించింది. సెంచురీస్ లైఫ్ స్టైల్ అనే సంస్థకు ఉతప్ప డైరెక్టర్‌గా ఉండగా.. ఆ సంస్థలో పని చేసే సిబ్బంది వేతనం నుంచి ఈపీఎఫ్ డబ్బులు రూ.23.36 లక్షలు కట్ చేశారని తిరిగి చెల్లించలేదని ఇటీవల కేసు నమోదైంది. దీంతో పాటు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్, రికవరీ నోటీసులను రద్దు చేయాలని ఉతప్ప హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మే నెలలోనే సదరు సంస్థ మేనేజర్ పోస్ట్‌కు ఉతప్ప రాజీనామా చేసినట్లు ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సైతం ఉతప్ప సంస్థ రోజూ వారీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని వెల్లడించారు.