Sunil Gavaskar : సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్స్‌లో ఆ ప్లేయర్ ఉండకపోవచ్చు.. గవాస్కర్
భారత సెలక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత సెలక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచన ప్రకారం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ సిరీస్‌తో ప్రారంభం అవుతుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత భారత్‌కు మ్యాచ్‌లు లేవు. ఒకవేళ భారత్ ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోతే సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్ల విషయంలో ఆలోచిస్తుంది. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరకు మీరు అందుబాటులో ఉంటారా? అని సెలక్టర్లు ఆటగాళ్లను అడుగుతారు. ఆ ధోరణిలోనే సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. రోహిత్‌కు ఇప్పుడు వయసు 38, వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి 40.’ అని గవాస్కర్ అన్నాడు. రోహిత్ సిడ్నీ టెస్ట్ గైర్హాజరు.. రానున్న రోజుల్లో భారత జట్టులో జరిగే భారీ మార్పులను సూచిస్తుందని ఆయన అన్నారు.