Border-Gavaskar Trophy : భారత్ ఆధిపత్యానికి బ్రేక్.. 10 ఏళ్ల తర్వాత విజేతగా ఆసిస్

ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో టీమ్ ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Update: 2025-01-05 12:43 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో టీమ్ ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా 3-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ఓటమితో టీమిండియా 8 ఏళ్లుగా అంటిపెట్టుకున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ సిరీస్‌కు ముందు గత నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎడిషిన్లలో భారత్‌దే ఆధిపత్యం. 2016-17 నుంచి 2022-23 వరకు టీమిండియా నాలుగుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. అందులో రెండుసార్లు(22016-17, 2022-23) ఆసిస్ గడ్డపై విజయకేతనం ఎగరవేసింది. 8 ఏళ్ల భారత్ ఆధిపత్యానికి ఈ సారి తెరపడింది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైసవం చేసుకుంది. ఇంతకుముందు 2014-15లో ఆసిస్ విజేతగా నిలువగా.. తిరిగి ట్రోఫీని దక్కించుకోవడానికి ఆ జట్టుకు పదేళ్లు పట్టింది. 1996-97 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్‌దే ఇప్పటికీ ఆధిపత్యం. 10 సార్లు టీమిండియా విజేతగా నిలుస్తే.. ఆసిస్ 6సార్లే సిరీస్‌ను దక్కించుకుంది. మరోసారి సిరీస్ డ్రాగా ముగిసింది. 

Tags:    

Similar News