భారత స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్ బై

భారత ఆల్‌రౌండర్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2025-01-05 18:17 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషి ధావన్.. ఆదివారం ఆంధ్రతో మ్యాచ్ అనంతరం వీడ్కోలు ప్రకటన చేశాడు. ‘20 ఏళ్లుగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది. నా హృదయానికి దగ్గరైన ఆట. భారమైన హృదయంతో భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కొత్త కలలు, కొత్త అవకాశాలతో జీవితంలో ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. క్రికెట్ నాలో నింపిన నైపుణ్యాలు, విలువలు తర్వాతి దశను నడిపిస్తాయని నమ్ముతున్నా.’ అని రిషి ధావన్ పేర్కొన్నాడు. కాగా, 34 ఏళ్ల రిషి ధావన్‌కు జాతీయ జట్టు తరపున ఎక్కువ అవకాశాలు అందుకోలేదు. 2016లో 3 వన్డేలు, ఒక టీ20లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ముంబై, పంజాబ్, కోల్‌కతాకు ఆడాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలో అతను అన్‌సోల్డ్‌గా మిగిలాడు.


Tags:    

Similar News