భారత్ ఘోర పరాజయం.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఆస్ట్రేలియా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy )లో టీమిండియా(Team India) ఘోర పరాజయం పాలైంది.

Update: 2025-01-05 03:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy )లో టీమిండియా(Team India) ఘోర పరాజయం పాలైంది. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టు(Sydney Test) మ్యాచులో ఆసీస్ ఘన విజయం సాధించింది. రెండు మ్యాచులు డ్రాగా మిగలగా.. 03-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నది. ఐదో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేయగా, ఆసీస్ 181 పరుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 157 పరుగులు చేయగా, రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఆసీస్ విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖరారు చేసుకున్నది. ఇదిలా ఉండగా.. సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. 22 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్ ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 13 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 06 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News