IND Vs AUS: నిప్పులు చెరిగిన ఆసిస్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే భారత్ ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో టీమిండియా (Team India) చెత్త ఆట తీరుతో ఆలౌట్ దిశగా వెళ్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో టీమిండియా (Team India) 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. అంతకు ముందు టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్లు ఆసిస్ పేసర్ల ధాటికి వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. కీపర్ రిషభ్ పంత్ (40), రవీంద్ర జడేజా (26), శుభ్‌మన్ (20), బుమ్రా (22) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు.
ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul), విరాట్ కోహ్లీ (Virat Kohli), వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. మెల్‌బోర్న్ టెస్ట్ (Melbourne Test) సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక ఆసిస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ (Scott Boland) ఏకంగా 4 వికెట్లు తీసుకుని టీమిండియా (Team India) నడ్డి విరిచాడు. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 3, పాట్ కమిన్స్ (Pat Cummins)2, నాథన్ లయన్ (Nathan Lyon) ఒక వికెట్ తీసుకున్నారు.