రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం చోటు చేసుకుంది.
దిశ, సత్తుపల్లి : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం చోటు చేసుకుంది. వేంసూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన స్టీల్ షాపు యాజమాని నాగేశ్వరరావు (60) టీవీఎస్ మోటార్ సైకిల్ పై మర్లపాడు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్నాడు.
అదే సమయంలో సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్ కు చెందిన ఎస్కే. సిరాజ్ (25) విజయవాడ వైపు బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో మర్లపాడు గ్రామంలో ఎదురుగా వీరి వాహనాలు ఢీకొన్నాయి. దాంతో సిరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్థానిక వేంసూరు ఎస్సై మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.