గుండెను చీల్చి.. లివర్‌ను నాలుగు ముక్కలు చేసి.. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ హత్య కేసులో సంచలన విషయాలు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ పోస్ట్ మార్టమ్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Update: 2025-01-06 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ పోస్ట్ మార్టమ్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడిని హంతకులు అత్యంత కిరాతకంగా చంపినట్లు తేలింది. తలపై 15 ఫ్రాక్చర్లు ఉన్నట్లు గుర్తించారు. మెడ విరిగిపోయినట్లు నివేదికలో తేలింది. దీంతో పాటు అతడి గుండెను హంతకులు చీల్చివేశారు. లివర్‌ను నాలుగు బాగాలుగా కోసినట్లు తేలింది. ఐదు పక్కటెముకలతో పాటు మెడ భాగంలో ఎముకలు విరిగిపోయినట్లు గుర్తించారు. చేతి ఎముక ఫ్రాక్చర్ కాగా.. గుండెకు లోతుగా గాయమైనట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలింది. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. రూ.120 కోట్ల కాంట్రాక్టులో అవినీతిని ఆయన బయటపెట్టినందుకు ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే. జనవరి 3న ముఖేష్ డెడ్ బాడీ సురేష్ చంద్రకార్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైంది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకార్ పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News