నా చావుకు కారణం వారే.. వైరల్ అవుతున్న (MLHP) వైద్యురాలి సూసైడ్ నోట్..

మణుగూరు మండలానికి చెందిన ఓ నలుగురు ఏఎన్ఎమ్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని, అంతేగాక ఓ వ్యక్తి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అందుకే తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని మణుగూరు మండలానికి చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ లో పేర్కొంది.

Update: 2025-01-07 01:37 GMT

దిశ, మణుగూరు : మణుగూరు మండలానికి చెందిన ఓ నలుగురు ఏఎన్ఎమ్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని, అంతేగాక ఓ వ్యక్తి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అందుకే తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్ననని మణుగూరు మండలానికి చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ లో పేర్కొంది. సూసైడ్ నోట్ లో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మణుగూరు మండలం శివలింగపురం ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వెంకటలక్ష్మి, నాగజ్యోతి, అలేం జ్యోతి, రాధ అనే ఓ నలుగురు ఏఎన్ఎమ్స్, వీరితో పాటు మరో వ్యక్తి కోడే నాగరాజు కొన్ని రోజులు నుంచి మానసికంగా వేదిస్తున్నారని, అంతేగాక లక్ష రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మణుగూరు బండారు గూడెం సబ్ సెంటర్ లో పనిచేసే (MLHP) ఓ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుని సూసైడ్ నోట్ ద్వారా ఆరోపించింది. సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకొని సూసైడ్ లేటర్ కూడా రాసినట్లు తెలుస్తుంది.

తన మీద కావాలనే ఓ నలుగురు ఏఎన్ఎమ్స్, కోడే నాగరాజు అనే అతనితో కలిసి RTI వేపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సూసైడ్ నోట్ ద్వారా ఆమె ఆరోపించింది. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా సరే వినిపించుకోకుండా నువ్వు ఇక్కడ ఎలా ఉద్ద్యోగం చేస్తావో మేము చూస్తామని బెదిరించారని ఆ యువతి లెటర్ లో పేర్కొంది. అంతేగాక తనను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తే వెల్లకపోయేసరికి తన పై అధికారులకు ఫిర్యాదులు చేశారని లేటర్ లో రాసుకొచ్చింది. న్యూస్ పేపర్, సోషల్ మీడియాలలో తన పేరు పెట్టి న్యూస్ లు రాపించి పరువు తీశారని రాసుకొచ్చింది. అంతటికీ లొంగకపోయే సరికి తన మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపించారని కూడా లేటర్ పేర్కొంది. ఈ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ఆమె లెటర్ ద్వారా పేర్కొంది. నా చావుకి కారణం ఈ నలుగురు ఏఎన్ఎమ్స్, కోడే నాగరాజునని ఆమె పేర్కొంది. కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తల్లిదండ్రులు గుర్తించి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకోవాడానికి కారణమైన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


Similar News