ఘోర ప్రమాదం.. లారీ క్యాబీన్‌లో ఇరుక్కున్న డ్రైవర్, క్లీనర్

బుదవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ చెట్టును ఢీకొట్టడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2025-01-08 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుదవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం(fatal accident) చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ(Lorry) చెట్టును ఢీకొట్టడంతో క్లీనర్ మృతి(Cleaner Died) చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. కృష్ణా జిల్లా నాచారం నుంచి లోడ్ వేసుకొని గుజరాత్‌ వెళ్తున్న లారీ.. హుజూరాబాద్ మండలం(Huzurabad Mandal) మాందాడి పల్లిలో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారి(National Highway)పై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముందు బాగు పూర్తిగా ధ్వంసం కావడం తో లారీ క్యాబిన్ లో డ్రైవర్, క్లీనర్ ఇరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ప్రమాద స్థలానికి చేరుకొని క్యాబిన్ లో ఇరుకున్న వారిలో డ్రైవర్ ను బయటకు తీశారు. అయితే తీవ్రగాయాలైన క్లీనర్ అందులోనే మృతి చెందాడు. డ్రైవర్‌ను బయటకు తీసిన స్థానికులు, ఫైర్ సిబ్బంది.. అతన్ని చికిత్స నిమిత్తం.. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News