Elephant Attack: వేడుకల్లో ఏనుగు బీభత్సం.. 17 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళ రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Update: 2025-01-08 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళ రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలప్పురంలోని పుతియంగడి వద్ద ఉన్న మసీదు ప్రాంగణంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ అట్రాక్షన్ కోసం జాతర నిర్వాహకులు ఏనుగులను అక్కడికి తీసుకొచ్చారు. అయితే, అందులో ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ.. ఒక్కసారిగా జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘనటలో దాదాపు 17 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తో్ంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును బంధించారు. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News