గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మియాపూర్

Update: 2025-01-05 07:01 GMT

దిశ, శేరిలింగంపల్లి : గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని హఫీజ్ పేట్ లో రైల్వే స్టేషన్ వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో వ్యక్తిపై సిమెంట్ ఇటుకలతో తలపై మోది హత్య చేశారు దుండగులు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. సంఘటన స్థలం వద్ద క్లూస్ టీం తో వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Similar News