జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం..
జమ్మికుంట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరు వ్యక్తులను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే రాజయ్య అనే వ్యక్తితో పాటు పట్టణ పరిధిలోని దుర్గ కాలనీకి చెందిన సంపత్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం( ఎక్స్ ఎల్) పై వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో కారు బలంగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాజయ్య కాలు విరగగా, సంపత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. బాధితుల బంధువులు 108 కు సమాచారం ఇవ్వడంతో, వెంటనే 108 ద్వారా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు జమ్మికుంట పట్టడానికి చెందిన ఓ వైద్యురాలు కారుగా ప్రచారం నెలకొంది.