జైశ్వాల్ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్
ముంబై బ్యాటర్ ఆయుశ్ మ్హత్రె లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లో 150+పైగా స్కోరు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
దిశ, స్పోర్ట్స్ : ముంబై బ్యాటర్ ఆయుశ్ మ్హత్రె లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లో 150+పైగా స్కోరు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో మంగళవారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో ఆయుశ్ 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్స్‌లతో 181 రన్స్ చేశాడు. ఇంతకుముందు భారత యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్(19 ఏళ్ల 291 రోజులు) పేరిట ఈ ఘనత ఉండేది. 2019లో జార్ఖండ్‌పై ఈ ఫీట్ సాధించాడు. అయితే, 17 ఏళ్ల 168 రోజుల వయసులోనే ఆయుశ్ ఈ ఫీట్ సాధించి జైశ్వాల్ రికార్డును బ్రేక్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నాగాలాండ్‌పై 189 పరుగుల తేడాతో ముంబై భారీ విజయం సాధించింది. ముందుగా ఆయుశ్ విధ్వంసానికితోడు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్(73 నాటౌట్,28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ), రఘువంశీ(56) రాణించడంతో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 403/7 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో నాగాలాండ్ 214/9 స్కోరు చేసింది. సుచిత్(104) శతక పోరాటం వృథా అయ్యింది.