రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. కారణం అదేనంటూ ప్రకటన

సౌరాష్ట్ర వికెట్ కీపర్, బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

Update: 2025-01-03 18:14 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌరాష్ట్ర వికెట్ కీపర్, బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. యువకులకు అవకాశం ఇవ్వడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో డిసెంబర్ 31న పంజాబ్‌తో మ్యాచే అతనికి చివరిది. లిస్ట్ ఏ క్రికెట్‌లో(50 ఓవర్ల ఫార్మాట్) 84 ఇన్నింగ్స్‌ల్లో 2,792 రన్స్, 80 టీ20ల్ 1,812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో జాక్సన్ బెంగళూరు, కోల్‌కతాలకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. మహరాష్ట్రతో ఫైనల్‌లో చేసిన సెంచరీ అతని కెరీర్‌‌లోనే హైలెట్‌గా నిలిచింది. దేశవాళీలో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ జాక్సన్‌ జాతీయ జట్టు నుంచి మాత్రం పిలుపు అందుకోలేకపోయాడు.



Similar News