బాగా ఆడితే పీఆర్ అవసరం లేదు : ధోనీ

సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) ప్రమోషన్లపై భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-12-31 17:16 GMT

దిశ, స్పోర్ట్స్ : సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) ప్రమోషన్లపై భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాగా ఆడితే ఎలాంటి పీఆర్ అవసరం లేదన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోనీని పీఆర్ మేనేజ్‌మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘నేను సోషల్ మీడియాకు పెద్ద అభిమానినేమి కాదు. 2004లో నేను క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆ సమయంలో ట్విట్టర్ బాగా పాపులర్. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. మనం కూడా పీఆర్ క్యాంపెయిన్ చేద్దామని నా మేనేజర్లంతా చెప్పేవారు. కానీ, నేనే వద్దని చెప్పేవాడిని. నేను క్రికెట్ బాగా ఆడితే ఎలాంటి పీఆర్ అవసరం ఉండదని వారికి చెప్పేవాడిని.’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. ధోనీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని కోసమే మ్యాచ్ చూడటానికి వెళ్లే వాళ్లు చాలా మందే ఉన్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.


Tags:    

Similar News