IND Vs AUS: నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ.. కష్టాల నుంచి గట్టెక్కిన టీమిండియా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు.

Update: 2024-12-28 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 171 బంతులు ఆడిన నితీష్ 105 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 9 వికెట్లను కోల్పోయి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి, (105 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (50) భాగస్వామ్యంతో టీమిండియా ఫాల్ఆన్ గండం నుంచి బయటపడి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత్, ఆస్ట్రేలియా కన్నా.. 116 పరుగులు వెనకబడి ఉంది. భారత ఇన్సింగ్స్‌లో నితీశ్ రెడ్డి (105 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (50), యశస్వీ జైస్వాల్ (82), కేఎల్ రాహుల్ (24), రిషభ్ పంత్ (28) పరుగులు చేశారు. ఇక ఆసిస్ బౌలర్లలో ఆసిస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, పాట్ కమిన్స్ 3, నాథన్ లయన్ 2 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.  


Similar News