లంగా ఓణిలో బలగం బ్యూటీ.. ఈ వయ్యారి అందానికి చంద్రుడైనా తలవంచడా అంటూ కామెంట్స్

‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ కావ్య కళ్యాణ్ అందరికీ సుపరిచితమే.

Update: 2024-07-07 06:57 GMT

దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ కావ్య కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత ‘బలగం’ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో కుర్రకారును మాయ చేస్తునే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.

తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో లంగా ఓణి కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘ఈ వయ్యారి అందానికి చంద్రుడైనా తలవంచడా‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News