పోక్సో కేసు ఎఫెక్ట్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు BIG షాక్

ప్రముఖ టాలీవుడ్(Tollywood) కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Johnny Master)కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-05 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్(Tollywood) కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Johnny Master)కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన జానీ మాస్టర్‌‌కు ఇటీవలే మధ్యంతర బెయిల్‌ మంజూరు అయింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్‌ మంజూరు చేసింది.

అనంతరం అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్యంగా ఆయనకు నేషనల్ అవార్డు రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.


Similar News