ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అవతార్’ మూవీ నిర్మాత కన్నుమూత

ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2024-07-07 06:39 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అనారోగ్యం కారణంగా మరణిస్తే.. మరికొందరు సడెన్‌గా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతూ కుటుంబాన్ని, అభిమానులను విషాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా, సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హాలీవుడ్ నిర్మాత జోన్ లండౌ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లో జూలై 5న మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక జోన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జోన్ సినిమాల విషయానికొస్తే.. బ్లాక్ బస్టర్ టైటానిక్, అవతార్ సినిమాలు జేమ్స్ కామెరూన్‌తో కలిసి నిర్మించి సంచలనం సృష్టించారు. మొత్తంగా జోన్ 8 మూవీస్ నిర్మించగా.. మూడు చిత్రాలు ఆస్కార్ నామినేషన్‌లకు ఎంపికయ్యాయి. అంతేకాకుండా టైటానిక్ ఏకంగా 11 అవార్డులు సాధించ హాలీవుడ్ చరిత్ర తిరగరాయడంతో జోన్‌కు భారీ క్రేజ్ వచ్చింది. అలాగే ఈ మూవీ ఏకంగా 24వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. ఆయన ప్రస్తుతం అవతార్ ఫ్రాంచైజీ చిత్రాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జోన్ ఇలా సడెన్‌గా మరణించడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Similar News