సగానికిపైగా పించన్లు పంచేశారు..నగదు పంపకానికి రెడీ

కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. వ్యయం పెరిగిపోయింది. ఈ దశలో ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను కూడా వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో కూడా ఆదరువు లేని పేదలకు ఫించన్లు పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శభాష్ అనిపించుకున్నారు. ఏపీలో 59 లక్షల […]

Update: 2020-04-01 03:30 GMT

కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. వ్యయం పెరిగిపోయింది. ఈ దశలో ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను కూడా వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో కూడా ఆదరువు లేని పేదలకు ఫించన్లు పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శభాష్ అనిపించుకున్నారు.

ఏపీలో 59 లక్షల మంది పింఛను దారులున్నారు. వీరిలో సగానికి పైగా వృద్ధులుండగా, వ్యాధిగ్రస్తులు, వికలాంగులు కూడా పింఛను దారులే. వీరికి రేషన్ బియ్యం, పింఛనే ఆధారం. ఈ నేపధ్యంలో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా గ్రామ, వార్డు, సచివాలయ కార్యదర్శుల అకౌంట్లకు నగదును పంపిణీ చేశారు. పింఛన్లు అందజేయడంపై మర్గదర్శకాలు జారీ చేశారు.

దీంతో కరోనా భయం నేపథ్యంలో వలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేలి ముద్రలు కాకుండా గుర్తింపు కార్డు ఆధారంగా పింఛన్లు అందజేశారు. తొలి రోజు ఉదయం 9 గంటల సమయానికి 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన వారికి రేపు ఉదయం అందజేయనున్నారు. ఈ నెల 4 వ తేదీన 1000 రూపాయల చొప్పున అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

Tags: pension, distribution, andhra pradesh, money arrangements are completed

Tags:    

Similar News