శ్రీశైలం ఘాట్‌రోడ్ వాహనాల పై రద్దీ.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
కార్తీక మాసం కావడంతో గత కొన్ని రోజులుగా శ్రీశైలం(Srisailam) క్షేత్రానికి భారీగా భక్తుల రద్దీ(Crowd of devotees) పెరిగిపోయింది. ముఖ్యంగా వీక్ ఎండ్, ఆది, సోమవారాల్లో ఈ రద్దీ అధికంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాసం కావడంతో గత కొన్ని రోజులుగా శ్రీశైలం(Srisailam) క్షేత్రానికి భారీగా భక్తుల రద్దీ(Crowd of devotees) పెరిగిపోయింది. ముఖ్యంగా వీక్ ఎండ్, ఆది, సోమవారాల్లో ఈ రద్దీ అధికంగా మారింది. ఈ క్రమంలో ఘాట్ రోడ్ల వద్ద.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నారు. కార్తీక మాసమే కాకుండా ఇటీవల కాలంలో.. శ్రీశైలం-హైదరాబాద్ హైవే(Srisailam-Hyderabad Highway) రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రద్దీపై ఈ రోజు సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడు స్పందించి, ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. శ్రీశైలం ఘాట్‌రోడ్(Srisailam Ghatroad), దేవాలయానికి వెళ్లేమార్గాల్లో.. రద్దీని చక్కదిద్దాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో చర్చించి.. భక్తుల ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.