Pawan Kalyan : ఏపీ టూరిజంపై పవన్ కళ్యాణ్ సమీక్ష

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) సోమవారం రాష్ట్ర పర్యాటక, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-11-25 14:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) సోమవారం రాష్ట్ర పర్యాటక, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో టూరిజం(Tourism) అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వారసత్వ ప్రాంతాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడేలా అవగాహన చర్యలు చేపట్టాలని తెలియ జేశారు. పర్యాటక రంగం అభివృద్ది చేయడం వలన అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News