పెన్షన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందగానే పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పొందుతున్న లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.

Update: 2024-11-25 12:13 GMT

దిశ, వెబ్ డస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పొందుతున్న లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల డిసెంబర్ 1 ఆదివారం రావడం తో ఒకరోజు ముందుగానే పెన్షన్(pension) అందించాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎటువంటి అంతరాయం లేకుండా లబ్ధిదారులకు రూ. 4 వేల పెన్షన్(4 thousand pension) అందిస్తుంది. ఈ క్రమంలో డిసెంబర్ 1న పెన్షన్ అందించాల్సి ఉండగా.. ఆ రోజు ఆదివారం రావడంతో శనివారం(నవంబర్ 30) పెన్షన్ పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే 30 పెన్సన్ల పంపిణీ పూర్తి కాకపోతే.. డిసెంబర్ 1, 2 తేదీలోపు పూర్తి చేయాలని.. ఆదేశించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వగా.. అధికారంలో రాగానే.. రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం రూ. 4000 పెన్షన్ అందిస్తోంది.


Similar News