అల్లు అర్జున్‌కు అంబటి రాంబాబు సపోర్ట్.. పుష్పను ఎవరూ ఆపలేరంటూ..

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప-2 మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌తో పుష్ప-2 మూవీపై భారీ హైప్ పెరిగింది.

Update: 2024-11-25 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప-2 మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌తో పుష్ప-2 మూవీపై భారీ హైప్ పెరిగింది. అయితే ఏపీలో ఈ సినిమాపై రాజకీయ రంగు పులుముకుంది. గతంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీంతో జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ తీరును తప్పుపడుతూ, విమర్శలు గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప-2 మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఏపీలో ఆ సినిమాను అడ్డుకుంటామంటూ , బొమ్మ పడకుండా బహిష్కరిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకుల కామెంట్స్‌పై వైసీపీ లీడర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. అల్లు అర్జున్ అంటే కొంతమందికి జెలసీ అన్నారు. ఆ జెలస్‌తోనే వారి కడుపులు పుచ్చిపోతున్నాయని హాట్ కామెంట్ చేశారు. పుష్ప 2 సినిమాను అడ్డుకోవడం అంటే అర చేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకున్నట్లే అన్నారు. బాగున్న సినిమాను ఎవరూ అడ్డుకోలేరన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకుంటామని కొందరు శపథాలు చేశారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. పుష్ప పార్ట్-1 హాలీవుడ్ స్థాయిలో చాలా బాగా తీశారని, పుష్ప 2 కోసం అభిమానులే కాదు.. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారని అంబటి చెప్పారు.

కాగా, అంబటి రాంబాబు వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో, ఇటు సినిమా ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. ఆయన కామెంట్స్ వీడియోలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన అవ్వే కనిపిస్తున్నాయి. మరి అంబటి కామెంట్స్‌పై జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more...

Pushpa-2: 24 గంటల్లోపే 25 మిలియన్స్.. దూసుకుపోతున్న కిస్ కిసిక్కు


Tags:    

Similar News