డైరెక్టర్‌ను ఇరిటేట్ చేసిన వెంకటేష్.. సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌పై డీప్ డిస్కషన్ (వీడియో)

విక్టరి వెంకటేష్ (Venkatesh) త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (SankranthikiVasthunam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Update: 2024-12-26 14:31 GMT

దిశ, సినిమా: విక్టరి వెంకటేష్ (Venkatesh) త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (SankranthikiVasthunam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), ఆశ్వర్య రాజేష్ (Ashwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ (Updates) ఆకట్టుకోగా.. ‘గొదారి గట్టు’, ‘మీను’ సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ‘ఫస్ట్ సాంగ్ ‘గోదారి గట్టు’ రమణ గూగుల్ అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ ‘మీను’ భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు మూడో సాంగ్ ‘సంక్రాంతి సాంగ్’ కోసం మనం ఒక ఎక్స్‌టార్డినరీ వాయిస్ చూడాలి. హిందీ, మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ట్రై చేయాలి’ అని డైరెక్టర్ అంటాడు.

ఈలోపు వెనుక నుంచి తమిళ్ తమిళ్ అంటూ ఐశ్వర్య రాజేష్ అంటుంది. ఇంతలో వెనుక నుంచి వెంకటేష్ వచ్చి నేను పాడతా అంటాడు. డైరెక్టర్ షాక్ అయ్యి వెంకీ వైపు చూస్తాడు. ఇలా ఏడు సార్లు నేను పాడతా.. నేను పాడతా అంటూ వెంకటేష్ డైరెక్టర్ వెనుక పడటంతో ఫైనల్‌గా వెంకీతో ‘సంక్రాంతి సాంగ్’ పాడించేస్తాడు డైరెక్టర్. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘రెండు చార్ట్‌బస్టర్ మెలోడీల తర్వాత.. సంక్రాంతికి వస్తున్నాం నుంచి మూడవ సింగిల్ మీ అందరికి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ లిరికల్ వీడియో త్వరలో వస్తుంది’ అని అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. దీంతో ప్రజెంట్ ఈ వీడియో వైరల్‌గా మారింది.

Full View


Tags:    

Similar News