ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Update: 2024-12-27 02:17 GMT

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాస్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇతని మృతి పట్ల ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే.. తమిళంలో విజయ్ కాంత్ హీరోగా ‘భారతన్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో ‘వీఐపీ’ అనే సినిమాను తెరకెక్కించారు. అలాగే తెలుగులో ప్రముఖ నటుడు జగపతి బాబు, కళ్యాణి జంటగా నటించిన ‘పందెం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాగా సభా తమిళంలో తీసిన ‘సుందర పురుషుడు’ అనే సినిమాను ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు.

Tags:    

Similar News