మీరు రెడీనా.. బాక్స్ బద్దలు కావల్సిందే.. ఆకట్టుకుంటున్న విశ్వక్ పోస్ట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila).

Update: 2024-12-27 14:15 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ (Director Ram Narayan)దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన విశ్వక్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలు ఉన్న ‘లైలా’ లవర్స్ డే (Valentine's Day)స్పెషల్‌గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చాడు హీరో విశ్వక్ సేన్. ఈ మేరకు ‘సోను మోడల్ వైబ్ కోసం మీ స్పీకర్‌లను సిద్ధం చేసుకోండి.. లైలా మొదటి సింగిల్ సోను మోడల్ ప్రోమో రేపు ఉదయం 11:07కి రాబోతుంది’ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్‌తో పాటు విశ్వక్ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. 

Tags:    

Similar News