ఇమ్మానుయేల్‌తో గొడవ.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసేశా : జబర్దస్త్ వర్ష

ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం

Update: 2024-12-28 09:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : మల్లెమాల స్టేజ్ మీద పాపులర్ అయిన జోడీల్లో సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ గౌతమ్ మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే, మొదట్లో వీరి లవ్ ట్రాక్ కోసమే ఎంతోమంది ప్రేక్షకులు జబర్దస్త్ ను చూశారు.అందుకే, ఈ జంటకి రెండు , మూడు సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. అయితే, ఈ జోడీ తర్వాత జబర్దస్త్ వర్ష-ఇమ్మానుయేల్ కూడా బాగా ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరి మధ్య నిజంగానే ప్రేమించుకున్నట్టు ఆడియన్స్ అనుకున్నారు. అయితే, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే వర్ష పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే, తాజాగా ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్‌లో ఇమ్మానుయేల్ గురించి వర్ష చాలా ఎమోషనల్ అయింది.

లేటెస్ట్ ప్రోమోలో షోకి వచ్చిన జంటలన్నీ ఈ ఏడాది వారికీ ఎలా గడిచిందో చెప్పుకొచ్చాయి. అయితే, వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకోటి అసలు వద్దు అంటూ చాలా ఎమోషనల్ అయింది. " నా జీవితంలో అయితే ఇలాంటి ఏడాది లాంటి ఏడాది మళ్లీ ఎప్పటికి చూడకూడదు అనుకుంటున్నా.. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం.. ఈ ఏడాది ఇమ్మానుయేల్‌కి ఒకసారి కాదు.. లెక్క లేనన్ని గొడవలు జరిగాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నామంటూ" వర్ష చెప్పింది. మరి, వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 

Tags:    

Similar News