ఘోర ప్రమాదం.. హీరోయిన్ కారు ఢీకొని ఒకరు స్పాట్ డెడ్

మరాఠి నటి ఊర్మిల కోఠారె(Urmila Kothare) ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పనులు చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.

Update: 2024-12-28 12:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరాఠి నటి ఊర్మిల కోఠారె(Urmila Kothare) ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పనులు చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ముంబై నగరం(Mumbai City)లో చోటుచేసుకుంది. నటి ఊర్మిలతో పాటు ఆమె డ్రైవర్‌కు కూడా గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఊర్మిళ(Urmil) మరాఠీ టెలివిజన్, సినిమా నటి, క్లాసికల్ డాన్సర్. దునియాదారి, శుభ మంగళ్ సావధాన్, తి సద్ధ్యా కే కర్తే వంటి మరాఠీ సినిమాలు పేరు తెచ్చాయి. మాయికా, మేరా ససురల్ వంటి హిందీ టీవీ సీరియల్స్, అసంభవ్, ఉన్ పాస్, గోష్టా ఎకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 2014లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

Tags:    

Similar News