Cyber Crimes: స్కామ్ చేద్దాం అని కాల్ చేసిన వ్యక్తికి షాక్.. నెట్టింట వీడియో వైరల్
స్కామ్(Scam) చేద్దాం అని పోలీస్ డ్రెస్(Police Dress) లో వీడియో కాల్(Video Call) చేసిన మోసగానికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు.
దిశ, వెబ్ డెస్క్: స్కామ్(Scam) చేద్దాం అని పోలీస్ డ్రెస్(Police Dress) లో వీడియో కాల్(Video Call) చేసిన మోసగానికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఇటీవల డిజిటల్ అరెస్టుల(Digital Arrest) పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్ చేసి అమాయకులను మోసం చేసి దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సైబన్ నేరగానికి ఓ వ్యక్తి రివర్స్‌లో షాక్ ఇచ్చాడు. వీడియో ప్రకారం ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి ముంబై పోలీస్ అధికారిని(Mumbai Police Officer) అంటూ మాట్లాడాడు. కాల్ ఎత్తిన వ్యక్తి దీనిని సైబర్ మోసంగా గుర్తించి, కుక్క పిల్లను మొబైల్ స్క్రీన్ ముందు పెట్టాడు. అంతేగాక వచ్చాను సర్.. చెప్పండి నకిలీ యూనిఫాం సర్ అని సంభాషించాడు. దీంతో స్కామ్ ఫలించలేదని అవుతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఈ సంఘటనను వీడియో తీసి అవగాహన కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్(Viral)గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వీడియోలోని వ్యక్తి రాక్.. స్కామర్ షాక్.. అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.