Viral Video: 'రండి.. దోచుకోండి' బట్టల షాప్ యజమాని దిమ్మ తిరిగే ఆఫర్.. ఏమైందంటే?
స్టోర్ యజమానులు బట్టల రేట్లపై ఆఫర్లు ఇవ్వడమనేది కామన్‌గా తెలిసిన విషయమే.
దిశ, డైనమిక్ బ్యూరో: స్టోర్ యజమానులు బట్టల రేట్లపై ఆఫర్లు ఇవ్వడమనేది కామన్‌గా తెలిసిన విషయమే. పది శాతం నుంచి దాదాపు 70 శాతంపైగా డిస్కౌంట్ ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ప్రజలకు దిమ్మ తిరిగిపోయే ఆఫర్ (Bumper Offer) ఓ స్టోర్ యజమాని ఇవ్వడంతో కస్టమర్ల తాకిడితో తొక్కిసలాట జరిగింది. 'రండి.. దోచుకోండి' అన్నట్లుగా ఓనర్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్ డే (Boxing Day) సందర్భంగా స్టోర్ యజమాని ఇచ్చిన ఆఫర్ ఇది.
(Perth) పెర్త్‌కు చెందిన స్ట్రీట్ ఎక్స్ అనే బట్టల దుకాణం యజమాని డేనియల్ బ్రాడ్ షా.. వందలాది టీ షర్టులు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నా అని ప్రచారం చేశాడు. ఇంకేముంది.. ఈ ఆఫర్‌తో స్టోర్‌లో జనం కిక్కిరిసిపోయారు. మరోవైపు జనం ఎగబడటంతో స్వల్ప తొక్కిసలాట కూడా సంబవించింది. ఈ తొక్కిసలాటలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.