నిత్యావసర వస్తువులతో కండోమ్స్ పోటీ.. స్విగ్గీలో 2 లక్షల ప్యాకెట్లు ఆర్డర్

ప్రుముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ స్విగ్గీ.. ఏడాది కాలంలో జరిగిన ఆర్డర్లపై డాటాను విడుదల చేసింది.

Update: 2024-12-27 15:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రుముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ స్విగ్గీ.. ఏడాది కాలంలో జరిగిన ఆర్డర్లపై డాటాను విడుదల చేసింది. అయితే ఈ ఆర్డర్లలో బిర్యాని వరుసగా తొమ్మిదో సంవత్సరం టాప్ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వివిధ వస్తువులు ఉన్నాయి. అయితే ఈ యాప్ ద్వారా నగర వ్యాప్తంగా జరిగిన ఆర్డర్లో.. నిత్యావసర వస్తువులు టాప్ లో ఉండగా.. వాటితో పాటు.. కాండోమ్ ప్యాకెట్స్ కూడా పోటీలో నిలిచాయి. తాజా డేటా ప్రకారం.. హైదరాబాద్ నగర వాసులు.. గడచిన సంవత్సరంలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్లను ఆర్డర్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అలాగే కోట్ల చిప్స్ ప్యాకేట్లను కూడా ఆర్డర్ చేసుకున్నారని.. అత్యధికంగా పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వంటి నిత్యవసర వస్తువులను ఆర్డర్ చేశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంలో ఏకంగా రూ. 31 కోట్లు కేవలం ఐస్ క్రీమ్ తినడానికి ఖర్చు చేయగా.. 15 కోట్లు.. మహిళలు బ్యూటీ ప్రొడక్ట్స్ కు ఖర్చు చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అయితే ఈ డేటా తాజాగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇది డిసెంబర్ నెలకు ముందు డేటా ఉందని.. డిసెంబర్ న్యూయర్ లను కలిపితే కండోమ్ ల కొనుగోళ్ల సంఖ్య భారీగా పెరిగిపోతదని న్యూయర్ ను ఉద్దేశిస్తూ.. సెటైర్లు వేస్తున్నారు.


Read More..

Telangana Police: స‌ర‌దా పడుతున్నారని మైన‌ర్లకు వాహ‌నాలు ఇస్తున్నారా? 

Tags:    

Similar News