Ambati Rambabu:తెలంగాణ ప్రభుత్వం పై మాజీ మంత్రి అంబటి సంచలన ట్వీట్!?
తెలుగు సంచలనం నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) తన అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు.
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు సంచలనం నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) తన అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు అతని అర్ధ శతకం సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్ప(Pushpa) స్టైల్లో తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అనుకరించాడు.
దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) నితీశ్ కుమార్ రెడ్డి సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియోను పంచుకుంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆయన సెటైర్లు వేశారు. ‘‘ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్‌ని(Allu Arjun) వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదేలా అబ్బా?’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణ(Telangana)లో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.