Dwarka Tirumala Rao: డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు ఎవరు భయపడొద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు
మన దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు(Online Frauds) బాగా పెరిగాయి.
దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు(Online Frauds) బాగా పెరిగాయి. డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరిట సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు దోచుకున్న ఘటనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ(AP DGP) ద్వారకా తిరుమలరావు(Dwarka Tirumala Rao) స్పందించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్(Help Line No)కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్‌కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని, 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు దోచుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో తొలిసారి మనమే స్మార్ట్ పోలీస్ ఏఐ సాంకేతికను(AI Technology) యూజ్ చేస్తున్నామని, ఏలూరు(Eluru) జిల్లా పోలీసులు దీన్ని స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు.