Minister: ఒకరిని టార్గెట్ చేసేంత టైమ్ పవన్‌ కల్యాణ్‌కు లేదు

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై రాజకీయ కక్ష తీర్చుకోవాల్సిన అవసరం తమకేమీ లేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పష్టం చేశారు.

Update: 2024-12-28 16:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై రాజకీయ కక్ష తీర్చుకోవాల్సిన అవసరం తమకేమీ లేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పనులన్నీ పక్కకు పెట్టి ఎవరిమీదో కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వా(AP Govt)నికి లేదని అన్నారు. ప్రజలు తమకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని.. తాము చేయాల్సిన పని చాలా ఉందని.. ఎవరినో టార్గెట్ చేసేంత టైమ్ లేదని తెలిపారు. అసలు తప్పు చేయకపోతే జరిమానా ఎందుకు కట్టారని ప్రశ్నించారు. గోడౌన్ ఎవరి పేరుమీద ఉంటే వారిపై కేసులు ఉంటాయని అన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు కూడా పేర్ని నాని స్పందించలేదని అన్నారు.

వైసీపీ హయాంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసి స్వార్థం కోసం పనిచేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గిడ్డంగుల్లో తనిఖీలు చేయమని నవంబరు 26న ఆదేశించాం. ఆ మరుసటి రోజే జయసుధ తప్పు అంగీకరించి లేఖ రాస్తే.. 378 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి రూ.1.70 కోట్లు కట్టమంటే కట్టారు. తర్వాత నోటీసులకు పేర్ని నాని స్పందించలేదు. 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎక్కడకు వెళ్లాయో తేలాలి కదా. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే అవసరం సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌(Pawan Kalyan)కు లేదు’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Tags:    

Similar News