Tirumala: తిరుమలలో సిఫారసు లేఖల కోసం స్పెషల్ ఆఫీసర్

తిరుమలలో తెలంగాణ లేఖల వ్యవహారాల కోసం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ ను నియమించింది.

Update: 2024-12-28 06:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకునేందుకు టీటీడీ (TTD) బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (TG GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిఫారసు లేఖల వ్యవహారాలను చూసుకునేందుకు ఓఎస్డీని నియమించింది. సి.గణేశ్ కుమార్ సేవలను వినియోగించుకునేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. రెండేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తూ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News