Police: బౌన్సర్లకు మరోసారి వార్నింగ్! బౌన్సర్లతో వ్యక్తి హల్ చల్‌పై తెలంగాణ పోలీస్ హెచ్చరిక
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఓ యువకుడు బౌన్సర్లతో (bouncers) శనివారం కొండాపూర్‌లోని ఏఎంబీమాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో హల్ చల్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఓ యువకుడు బౌన్సర్లతో (bouncers) శనివారం కొండాపూర్‌లోని ఏఎంబీమాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో హల్ చల్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మాల్ సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో జరిగిన వాగ్వాదం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇవాళ తెలంగాణ పోలీస్ (Telangana Police) ఎక్స్ వేదికగా మరోసారి బౌన్సర్లుకు వార్నింగ్ ఇచ్చింది. (Social media) సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత చేసే పనులు వారి జీవితాలను నాశనం చేస్తాయి అని సూచించింది.
క్రిమినల్ కేసులతో జైలుకు వెళతారని, ఇలాంటి పనులను ప్రోత్సహించే బౌన్సర్లపై, బౌన్సర్ల ఏజెన్సీలపై కూడా అత్యంత కఠిన చట్టాలతో క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించింది. కాగా, ఇటీవల బౌన్సర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బౌన్సర్ల తీరుపై సీపీ మండిపడ్డారు. ఈ క్రమంలోనే బౌన్సర్ల ఏజెన్సీలు నియమ నిబంధనలు పాటించాలని కీలక సూచనలు చేశారు.