NTR: ఆమెతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఈ ఏడాది ‘దేవర’(Devara: Part 1) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Update: 2024-12-28 13:46 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఈ ఏడాది ‘దేవర’(Devara: Part 1) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 27న భారీ అంచనాల మధ్య విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌(Prashant Neel) కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంతో పాటు ఎన్టీఆర్ ‘వార్-2’లోనూ నటిస్తున్నారు. అలాగే షూటింగ్స్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, తారక్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి లండన్(London) వీధుల్లో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తన కుటుంబంతో కార్నివాల్ (Carnival)ఎగ్జీబీషన్‌లో సందడి చేశారు. అంతేకాకుండా పలు వస్తువులు కొనుగోలు చేస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో(Video)ను నెటిజన్లు షేర్ చేస్తూ టైగర్ చిల్లింగ్ మోడ్‌లో ఉందనే క్యాప్షన్ జత చేస్తున్నారు.


Read More..

ప్రభాస్, విజయ్‌లపై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే? 


Tags:    

Similar News