Nagababu: వ్యాయామం లేనిది జీవితమే లేదు.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ మెగా బ్రదర్ పోస్ట్

మెగా బ్రదర్ నాగబాబు(Mega Brother Nagababu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-12-29 03:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు(Mega Brother Nagababu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈయన టీవీ వ్యాఖ్యాత(TV presenter)గా, నిర్మాత(producer)గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌(character artist)గా, వ్యాఖ్యాతగా చేసి తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో మొత్తం ఐదు మూవీలను నిర్మించార. ఈ చిత్రాల్నినాగబాబు తల్లి అంజనా దేవి(Anjana Devi) పేరిట అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌(Anjana Productions banner)లో నిర్మించారు. చిరంజీవితో మొదటిసారిగా రుద్ర వీణ మూవీని నిర్మించారు.

బాలచందర్(Balachander) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి జాతీయ అవార్డు(National Award) రావడం విశేషం. అలాగే ఏ. కోదండరామిరెడ్డి(A. Kodandarami Reddy) దర్శకత్వంలో త్రినేత్రుడు(thrinethrudu), హిందీలో నసీరుద్దరీన్ షా నటించిన ‘జల్వా’(Jalwa), రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో ముగ్గురు మొనగాళ్లు(muggurumonagallu), అన్నదమ్ముల అనుబంధం వంటి చిత్రాల్ని నిర్మించారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బావగారూ బాగున్నారా(Bavagaru bagunnara) సినిమా అయితే బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్(Stalin) మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరించారు.

అన్నయ్య చిరంజీవితోనే కాకుండా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన గుడుంబా శంకర్(Gudumba Shankar) సినిమాను కూడా తీశారు. ఇకపోతే నాగబాబు తాజాగా జిమ్‌లో భారీ వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సర్‌సైజ్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ పిక్స్‌కు వ్యాయామం(exercise) లేనిది.. జీవితమే లేదని క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగా బ్రదర్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Full View

Tags:    

Similar News