పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజి‌ని సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌(Paralympics)లో భారత్ నుంచి 400 మీటర్ల పరుగు పందెంలో పోటీలో నిలిచిన దీప్తి జీవాంజి‌(Deepti Jeevanji) క్యాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Update: 2024-12-30 15:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌(Paralympics)లో భారత్ నుంచి 400 మీటర్ల పరుగు పందెంలో పోటీలో నిలిచిన దీప్తి జీవాంజి‌(Deepti Jeevanji) క్యాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యువతి. కాగా ఈ రోజు హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ(Pullela Gopichand Badminton Academy)లో దీప్తి జీవాంజి‌కి సన్మాన కార్యక్రమం(Honors Program) నిర్వహించారు. కాగా ఈ సన్మాన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో(Tollywood star hero) మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పాల్గొన్నారు. అనంతరం పారాలింపిక్స్‌లో భారత్ కు కాంస్య పతాకాన్ని సాధించిన జీవాంజి దీప్తిని చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు(Honored with a shawl). ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గోన్నారు.


Similar News