Enforcement Directorate: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కీలక పరిణామం

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు(Formula E-Car Race Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) దూకుడు పెంచింది.

Update: 2025-01-02 13:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు(Formula E-Car Race Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) దూకుడు పెంచింది. బీఎల్‌ఎన్‌ రెడ్డి(BLN Reddy), అరవింద్‌ కుమార్‌(Arvind Kumar)లకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవింద్‌కుమార్‌లు తప్పకుండా విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. జనవరి 2న బీఎల్ఎన్ రెడ్డి, జనవరి 3న అరవింద్ కుమార్, జనవరి 7న కేటీఆర్‌(KTR)ను విచారించాలని ఈడీ ప్లాన్ చేసింది. అయితే అనూహ్యంగా ఇవాళ ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతూ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్‌కు మెయిల్ పంపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు గడువు ఇచ్చారు. ఈనెల 8,9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా రావాలని కోరింది. మరోవైపు రేపు అరవింద్ కుమార్, ఈ నెల 7న కేటీఆర్ విచారణకు హాజరవుతారా అనేది చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News