శివన్న ఇంట్లో విషాదం.. నీవు ఎప్పుడూ మాతోనే ఉంటావంటూ భార్య గీత ఎమోషనల్ పోస్ట్
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో విలన్ రోల్ ప్లే చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇతనికి ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని మియామీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఆయనకు సర్జరీ సక్సెస్ ఫుల్‌గా పూర్తయ్యింది. దీని నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఇంతలోనే శివన్న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శివరాజ్ కుమార్ ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్ డాగ్ కన్నుమూసింది. ఈ విషయాన్ని హీరో సతీమణి గీతా శివ రాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంతే కాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.
‘మా ఇంట్లో మేము ఐదుగురు కాదు ఆరుగురం. శివన్న, గీత, నిషు, నివి, దిలీప్ ఇంకా నీమో (పెట్ డాగ్). దిలీప్ నిమోను నిషూ పుట్టినరోజున ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. నిషు డాక్టర్ కావడం వల్ల దానిని చూసుకునేంత టైం లేదు. దీని ద్వారా మా కుటుంబంలో వాడు ఆరవ వ్యక్తి అయ్యాడు. సాధారణంగా అందరూ పెంపుడు కుక్క వెంట పరుగెత్తుతారు. కానీ మా నీమో అలా కాదు. నేను కిచెన్‌లో ఉన్నా, ఇంట్లో ఎక్కడికి వెళ్లినా నా వెనుకే ఉండేది. నీమో నా జీవితంలో ఒక భాగం. నీమో, గీత ఇద్దరు కాదు, మేమిద్దరం ఒక్కటే. నే నే కాదు మా కుటుంబంలో అందరూ నీమోను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. నీమో ఎప్పుడూ మనలోనే ఉంటుంది’ అని శివన్న భార్య తన పెట్ డాగ్ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.