Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత బేబీ బంప్ ఫొటోస్.. షాక్‌లో నెటిజన్లు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-12-28 09:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతోమంది అభిమానులకు సొంతం చేసుకుంది. గత ఏడాది శాకుంతలం(Shakunthalam), ఖుషి సినిమాలతో అలరించిన ఆమె మయోసైటీస్(Myositis) బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇటీవల మళ్లీ ‘సిటాడెల్: హనీ,బన్నీ’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

దీంతో పాటు సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. నాగచైతన్య, శోభిత(Sobhita Dhulipala)ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

కానీ సమంత మాత్రం అన్నింటికీ దూరంగా అయినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా పలు రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంతకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోలు(Baby Bump Photos) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏఐతో సాయంతో వాటిని ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. వాటిని సడెన్‌గా చూసిన వారంతా నిజమే అనుకుని షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం అలా ఎడిట్ చేసిన వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.


Read More..

‘ప్రపంచంలోనే అతను బెస్ట్’.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 


 

 

Tags:    

Similar News