Allu Arjun: మరోసారి పెద్ద స్క్రీన్లపై అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి. అంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీకి సీక్వెల్‌గా ‘ఆర్య-2’ (Arya-2) తెరకెక్కిన విషయం తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. 2009లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో ఐకాన్‌స్టార్ పర్‌ఫార్మెన్స్, దేవి శ్రీప్రసాద్ సన్సేషనల్ మ్యూజిక్ అందరికి ఆకట్టుకుంది. అంతే కాకుండా.. ఆర్యతో పాటు ఆర్య-2 కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు వన్‌ఆఫ్ ద ఫేవరేట్ సినిమాగా నిలిచింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్(Re release)కు సిద్ధమైంది.
‘ఆర్య-2’ మూవీ ఏప్రిల్ 5న రీ రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను నైజాంలో క్రేజీ షౌట్ మీడియా (Crazy Shout Media) వారు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మరోసారి పెద్ద స్క్రీన్లపై మ్యాజిక్‌ను తిరిగి చూడటానికి సిద్ధంగా ఉండండి.. ఆర్య-2 ఏప్రిల్ 5న రాబోతుంది’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటుంది. కాగా.. ఆదిత్య ఆర్ట్స్ (Aditya Arts) పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్యబాబు నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించగా.. నవదీప్ (Navdeep) ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతుండటంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.