వీడేంటీ ఇలా ఉన్నాడు అనుకున్నారు.. మహేశ్ బాబుపై ప్రదీప్ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Anchor Pradeep), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి (Deepika Pilli) జంటగా నటిస్తున్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi).

Update: 2025-04-04 14:23 GMT
వీడేంటీ ఇలా ఉన్నాడు అనుకున్నారు.. మహేశ్ బాబుపై ప్రదీప్ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Anchor Pradeep), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి (Deepika Pilli) జంటగా నటిస్తున్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). నితిన్, భరత్ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బందం.. ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో పాట ‘ప్రియమర’ 05-04-2025 రాబోతున్నట్లు అనౌన్స్ చేసి ఓ బ్యూటిఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు‌(Mahesh Babu)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘మహేశ్ గారిని నేను ఎప్పుడు పర్శనల్‌గా కలవలేదు. దూరం నుంచే చూశాను. ఒకసారి నా టాక్ షోకు ఆయన వచ్చారు. ఒక హోటల్‌లో చిన్న టీవీ సెట్‌లా వేసి అక్కడే షూట్ చేశాము. అదే ఫస్ట్ నేను ఆయనతో డైరెక్ట్‌గా మాట్లాడటం. అప్పుడు ఆయన నన్ను ఎలా చూశారంటే ఒక వింజ జంతువును చూసినట్టు ఏంటీ ఇలా ఉన్నాడు వీడు అన్నట్లు చూశారు. ఇక కొంచెం సేపు చేసిన తర్వాత మహేశ్ బాబు వాళ్ల టీమ్ వాళ్లు వచ్చి చాలు ఇక ఆపేయ్ అన్నట్లు నాకు సైగా చేశారు. అప్పుడు మహేశ్ ఏంటీ మా వాళ్లు ఆపేయ్ అంటున్నారా.. పర్వాలేదులే నువ్వు ఏమి అనుకుంటున్నావో అన్నీ అడుగు అంటూ చెప్పారు. ఆ తర్వాత మహేశ్ బాబు ఏ ఈవెంట్‌కు వెళ్లిన అక్కడ నేను ఉన్నాన లేదా అని అడిగేవారు. ఒకసారి అయితే.. అది నా ఈవెంట్ కాకపోయిన సరే నేను ఉండాలని నాకు ఫోన్ చేయించి మరి నన్ను ఫ్లైట్‌లో తీసుకెళ్లారు. ఆ క్షణం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News