Preity Zinta: సల్మాన్‌తో డేటింగ్.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా అంటూ క్లారిటీ ఇస్తూ ప్రీతి జింటా ట్వీట్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రీతి జింటా డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది.

Update: 2024-12-28 08:40 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రీతి జింటా డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది  కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది. దీనిపై ఇన్నాళ్లకు ఆమె క్లారిటీ ఇచ్చింది. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రీతి జింటా(Preity Zinta) స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా అతనితో దిగిన ఫొటోల(Photos)ను కూడా నెట్టింది పెట్టింది. ‘‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫొటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్ చేస్తే ఉంటాను’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో అది చూసిన ఓ నెటిజన్ ఏంటి మీరిద్దరు డేటింగ్ చేశారా? అని ప్రశ్నించాడు.

ఆ పోస్ట్ చూసిన ప్రీతి జింటా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘అతడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అలాగే నా భర్తకు కూడా మంచి స్నేహితుడే. నాకు నా కుటుంబ సభ్యుడి లాంటి వాడు. మీరేంత ఊహించుకున్నా ఇదే నిజం’’ అని రిప్లై ఇచ్చింది. ఇక ఇన్నాళ్లకు వీరిద్దరి మధ్య ప్రేమాయణం గురించి క్లారిటీ ఇచ్చిందని అంతా అనుకుంటున్నారు. కాగా, సల్మాన్, ప్రీతి జింటా.. హార్ దిల్ జో ప్యార్ కరేగా, దిల్ నే జీసే అప్నా కహా, జాన్ ఎ మన్, హీరోస్, ఇష్క్ ఇన్ పారిస్ వంటి చిత్రాల్లో జంటగా నటించి మెప్పించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికందర్’(Sikander) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రీతి జింటా మాత్రం గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు షేర్ చేస్తోంది.

Tags:    

Similar News