Aditya Om: గిరిజన గ్రామాలకు అండగా హీరో.. స్వచ్చమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ

నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు హీరో ఆదిత్య ఓం

Update: 2024-12-26 15:18 GMT

దిశ, సినిమా: నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు హీరో ఆదిత్య ఓం (Aditya Om). ఇటీవలే బిగ్ బాస్ (Bigg Boss) షోలో సందడి చేసిన ఈయన.. ప్రజెంట్ ‘బంధీ’ అనే చిత్రంతో ఆడియెన్స్ (audience) ముందుకు రాబోతున్నారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రమన్న సంగతి తెలిసిందే. పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా బంధీ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన తన గొప్ప మనసును చాటుకున్నారు.

తెలంగాణ (Telangana)లోని గిరిజన (tribal) గ్రామమైన చెరుపల్లి (Cherupalli)లో కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం చెరుపల్లి, ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలను తీర్చేందుకు RO వాటర్ ప్లాంట్ (water plant) నిర్మాణాన్ని ప్రారంభించారు. RO ప్లాంట్ నుంచి వచ్చే స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటితో అక్కడి ప్రజల సమస్యలు తొలిగిపోనున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరి ప్రజలకు అందించాలని అనుకుంటున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఆదిత్య ఓం త్వరితగతిన పనులు చేపడుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆదిత్య ఓంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News